అది ‘ఖుషి’ రిలీజ్ డేట్..మహేష్ సినిమాకు భయపడం..!

Sunday, October 29th, 2017, 11:25:49 PM IST

పెద్ద చిత్రాల విడుదల మధ్య రిజనబుల్ గ్యాప్ ఉండాలనే విషయాన్ని స్వర్గీయ దాసరి లాంటి సినీపెద్దలు చెబుతుండే మాట. దానివలన నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండదు. కానీ సినిమాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వారం కూడా గ్యాప్ లేకుండా కొన్ని పెద్ద చిత్రాలు విడుదలవుతున్న పరిస్థితి చూస్తున్నాం. తాజగా సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాల విడుదల తేదీ విషయం వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ నాపేరు సూర్య చిత్ర నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

బన్నీ నటిస్తున్న తాజా చిత్రం నాపేరు సూర్య వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. కాగా మహేష్ – కొరటాల కాంబోలో రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రం కూడా అదే తేదీన విడుదలవుతుందని ప్రకటించడడంతో వివాదం మొదలైంది. దీనిపై బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చిత్రం ‘ఖుషి’ విడుదల తేదీ అని ‘నాపేరు సూర్య’ని ఏప్రిల్ 27న విడుదల చేయడానికి ముందుగానే నిర్ణయించుకున్నాం. భరత్ అనే నేను చిత్రం కూడా అప్పుడే విడుదల చేస్తామని ప్రకటించడంతో బాధపడ్డాం. ఈ సమయంలో తాము వెనక్కి తగ్గితే భయపడ్డామని ప్రచారం చేస్తారు. అది మాకు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నాపేరు సూర్య చిత్రం ఏప్రిల్ 27 నే విడుదలవుతుంది. మహేష్ సినిమా నిర్మాత దానయ్య ముందుగా విడుదల గురించి మాకు చెప్పి ఉంటె చర్చించుకునే అవకాశం ఉండేది. వేరే విడుదల తేదీ గురించి ఆలోచించే వాళ్లం. కానీ ఇప్పుడు అది జరగదు. రాజమౌళి ‘ఈగ’ చిత్రం కోసం తమ ‘జులాయి’ని మూడువారాలు వెన్నక్కి జరిపిన సంగతిని బన్నీ వాసు గుర్తు చేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments