బర్నింగ్ ఇష్యూ : శ్రీరెడ్డి పై కేసు నమోదు

Wednesday, April 18th, 2018, 01:22:45 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం రేగుతుండడం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయమై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి నిన్న ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్, టీవీ సెన్సేషన్‌గా మారిన ఈమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని విమర్శించడంతో ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

శ్రీరెడ్డి వెనుక ఎవరో వుంది ఇదంతా నడిపిస్తున్నారని, కొందరైతే అధికార టిడిపి పని అంటుంటే, మరికొందరేమో ప్రతిపక్ష వైసిపి అని కామెంట్ చేస్తున్నారు. శ్రీరెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని, పవన్ ప్రజల సంక్షేమం కోసం సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన కేవలం అధికారం కోసం పార్టీ పెట్టలేదని, ప్రజలసమస్యలపై న్యాయంగా పోరాటం చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన ద్యేయంగా ముందుకు వెళ్తున్నారని పలువురు తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

కాగా శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై శశాంక్ వంశీ అనే కొరియోగ్రఫర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కావాలనే పవన్‌ని బూతులు తిడుతూ, పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్న శ్రీ రెడ్డిపై తగిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శశాంక్ వంశీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments