బర్నింగ్ ఇష్యూ : అంబేద్కర్ పేరు మార్పుపై చెలరేగుతున్న వివాదం!

Thursday, March 29th, 2018, 03:44:05 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్ పేరులో సవరణ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌గా ఉన్న పేరు మధ్యలో ‘ రాంజీ ’ని చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ప్రభుత్వ రంగంలోనూ అంబేడ్కర్‌ పేరును భీమ్‌రావ్‌ రాంజీ అంబేడ్కర్‌ గా సంబోధించాలని ఆదేశించింది. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నాయక్‌ అంబేడ్కర్‌ పేరులో సవరణ కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయగా గురువారం ఈ సవరణను తీసుకొచ్చారు.

అంబేడ్కర్‌ పేరులో సవరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు పార్టీలు ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంబేడ్కర్‌ సిద్ధాంతాలను, ఆశయాలను గౌరవించని పార్టీ బిజెపి అని పలువురు మండిపడుతున్నారు. కాగా మరోవైపు ఆర్‌ఎస్ఎస్‌ ఎస్పీ నేత దీపక్‌ మిశ్రా విమర్శలను కొట్టిపారేసింది. ఇందులో రాజకీయ కోణం లేదని తెలిపింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ చేర్చిన ‘రాంజీ’ అనే పేరు అంబేడ్కర్ తండ్రిదని, మహారాష్ట్రలో తండ్రి పేరును తమ పేర్ల మధ్యలో చేర్చడం ఆనవాయితీ అని బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ మహాసభ సంఘం డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌ నిర్మల్‌ తెలిపారు. ఏది ఏమైనప్పటికి ఆయన పేరులో రంజీ చేర్చడం కొందరు ఆమోదిస్తుంటే మరికొందరు వ్యతిరేకించడం ప్రభుత్వానికి కొంతరవకు సమస్యాత్మకంగా మారింది….