బర్నింగ్ ఇష్యూ : గల్ఫ్ ఉపాధి పేరుతో జీవితాన్ని సమాధి చేసుకోవద్దు!

Tuesday, April 10th, 2018, 04:28:40 PM IST

దూరపు కొండలు నునుపు అనేపదం మనం చిన్నపుడు ఏదో ఒక సందర్భంలో వైన్ ఉంటాం. అంటే ఇక్కడ మనకు వున్నదానికంటే అక్కడెక్కడికో వెళితే ఇంకొంత సంపాదించొచ్చు అనేది దాని అర్ధం. ఇటీవల కొందరు యువత గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో చాలామంది అక్కడ సరైన ఉపాధి లేక, వచ్చే డబ్బులు సరిపోక నానా యాతనలు పడుతున్న సంఘటనలు కొన్ని చూసాము. ముఖ్యంగా కరీంనగర్, మేదక్ చుట్టకుప్రక్కల ప్రాంతాల వారు సరైన పంటలు లేక, చాలీ చాలని ఆదాయంతో సతమవుతున్నారు.

అటువంటి వారు తమకు సరైన మార్గం గల్ఫ్ దేశం వెళ్లడమే అని తెలిసిన వారిని సంప్రదించి అక్కడికి వెళ్తున్నారు. అయితే నిజానికి అక్కడికి వెళ్తున్న వారిలో చాలా మంది అవగాహన రాహిత్యంతో వెళ్తున్నవారే. ఇటీవల కరీంనగర్ కు చేయండిన ఒక ముఠా ఒక ముప్పైమందిని గల్ఫ్ దేశాలకు పంపుతామనిసి చెప్పి ఒక్కొక్కరి దగ్గరినుండి రూ.20 వేల నుండి రూ.60 వెలవరకు దాదాపు 20 నుండి 30 లక్షలవరకు దోచేసిన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే బాధితులు పోలీస్ లకు కంప్లైంట్ చేయడంతో ఎట్టకేలకు ఆ ముఠాను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం వెళ్తున్న యువత ముఖ్యంగా అవగాహనా లోపంతో అక్కడికి వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు.

అత్యధిక జీతం, ఉచిత వసతి, ఇతరేతర ఆదాయాల పేరిట వ్యామోహంతో దళారీల చేతిలో చిక్కి పావులవుతున్నారు. ఇటువంటి వారి విష్యం లో ప్రభుత్వ యంత్రాఙ్గమ్ దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో పర్యాటక వీసా తో అక్కడికి వెళ్తున్నవారు మరింత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట కాలానికి సంబంధించిన పర్యాటక వీసాతో అక్కడ ఎక్కువ కాలం నివసించడానికి వీలుండదు. అక్కడకు వెళ్లిన అభ్యర్థి పని తీరు నాచనిదే అక్కడి కంపెనీలు వారికీ తాత్కాలిక వీసా మంజూరు చేయవు. దీనితో కంపెనీలలో చేరిన ఎక్కువమంది మూడు, నాలుగు నెలలకే తిరుగు ముఖం పడుతున్నారు.

అయితే ఇటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఎంపిక చేసిన కంపెనీ పైనే ఉపాధి పరిస్థితి ఆధారపడి ఉండడంతో వీసా తీసుకునే సమయంలో అభ్యర్థులు మరింత అప్రమత్తతతో వ్యవహరించవలసి ఉంటుంది. కావున గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లదలచిన వారు దళారులు చెప్పే కంపెనీ లు సరైనవేనా, అక్కడ ఉపాధి ఎంతవరకు దొరుకుతుంది, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ఆ కంపెనీ ఏమేరకు సహాపడుతుంది. మరియు ముఖ్యంగా అధిక ఆదాయం ఇస్తామని ఆశచూపి కంపెనీల పట్ల యువత మరింత జాగ్రత్త కలిగి ఉండాలని, అక్కడ ఉపాధి పేరుతో యువత తమ విలువైన జీవితాన్ని సమాధి చేసుకోవద్దని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు…..