బర్నింగ్ న్యూస్ : అది తెలుగు ద్రోహుల పార్టీ అంటున్న రోజా

Friday, April 6th, 2018, 08:04:53 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం ప్రస్తుత్తం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఓవైపు అధికార టిడిపి మరోవైపు విపక్ష వైసిపి ఢిల్లీ లో పోరాటం చేస్తున్నాయి. అలానే వామపక్ష పార్టీలతో కలిసి హోదా ఉద్యమంలో భాగంగా నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ లో జాతీయ రహదారులు ముట్టడి కార్యక్రమం నిర్వచించారు. హోదా ఆంధ్రుల హక్కని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారని రోజా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో పొడిచేస్తానని ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పరువు తీశారని మండిపడ్డారు.

ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయరా, అని రోజా నిలదీశారు. హోదా కావాలంటే టీడీపీ ఎంపీలు కూడా వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయన రాష్ట్రాన్నీ కేంద్రానికి తాకట్టుపెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టిగ బుద్ధిచెప్పడం ఖాయమని ఆమె అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments