వైరల్ వీడియో : బాస్ డ్రైవర్ లేచి డాన్స్ చేశాడు.. భయం ప్లస్ నవ్వు గ్యారెంటీ!

Tuesday, October 24th, 2017, 04:50:09 PM IST

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం లక్షల్లో ప్రమాదకరమైన వీడియోలు ఉన్నాయి. అలాగే నవ్వులు పూయించే వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒక వీడియో ను చూస్తే మొదట గుండె పట్టుకుంటారు. ఆ తర్వాత నవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం ఆ వెరైటీ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. చుసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కొలంబియా లో ఒక బస్సు డ్రైవర్ మంచిగా పాట వింటూ బస్సు నడుపుతున్నాడు. అప్పటివరకు బాగానే ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా లేచి డ్యాన్సులు వేశాడు. అతను డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో స్టీరింగ్ అటు ఇటు తిప్పడం చూస్తుంటే అసలు వాడు డ్రైవరేనా అని అనకుండా ఉండలేరు. కానీ చివరివరకు విడియోను చూస్తే అర్ధమవుతోంది. ఆ బస్సును ఒక ట్రక్కు ఓ ట్ర‌క్కు లాక్కెళ్తోంది. అది చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే!

  •  
  •  
  •  
  •  

Comments