హైదరాబాద్ లో కుప్పకూలిన బస్టాండ్!

Thursday, July 5th, 2018, 05:40:05 PM IST


రాజధాని నగరం హైదరాబాద్ లో నేడు ఒక బస్టాండ్ కుప్పకూలింది. నగరంలోని మొట్టమొదటి బస్టాండ్ అయిన గౌలి గూడ బస్టాండ్ నేడు ఈదురుగాలికి ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో బస్టాండ్ లో ప్రయాణీకులు కానీ, బస్సులు కానీ ఏమి లేకపోవడంతో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు. 88 ఏళ్ళ క్రితం నిర్మితమయిన ఈ బస్టాండ్ లో ఇంజినీర్ల సలహా మేరకు గత నెల 30న పూర్తిగా మూసి వేయడం జరిగిందని, అప్పటినుండి ఎవరిని బస్టాండ్ లోకి అనుమతించడం లేదు. 1930లో అమెరికా కు చెందిన బట్లర్ కంపెనీ ఈ బస్టాండ్ నిర్మాణాన్నీ చెప్పట్టింది. అప్పట్లో దీనికి మిసిసిపి ఎయిర్ క్రాఫ్ట్ హాంగర్ గా నామకరణం చేసారు. తరువాత నిజాంపాలనలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద దీనిని బస్టాండ్ గా మార్చారు.

తెలంగాణ మొత్తంలో పేరెన్నికగన్న కట్టడాల్లో గౌలిగూడ బస్టాండ్ కూడా ఒకటి. అప్పట్లో 30 ప్లాట్ ఫారాలతో 27 బస్సులతో గౌలి గూడ హంగేరి నుండి అన్ని ప్రాంతాలకు బస్సులు నిత్యం తిరుగుతుండేవని అధికారులు చెపుతున్నారు. అయితే 1994 తరువాత మాత్రం కేవలం లోకల్ బస్సులు మాత్రమే ఈ బస్టాండ్ నుండి ప్రయాణీకులని తమ తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. కాగా కూలిన బస్టాండ్ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి ఘటన స్థలికి చేరుకొని కూలడానికి గల కారణాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. కూలిన సమయంలో ఎవరు లేకపోవడం మంచిది అయిందని, త్వరలో కూలిన దాని స్థానంలో ఆర్టీసీకి మరింత ఆదాయం రావడం కోసం వినియోగిస్తామని, అతిత్వరలో ఈ విషయాన్నీ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి చర్చిస్తానని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments