తిరిగి సొంత గూటికి వెళుతున్న బుట్టా రేణుక‌?

Saturday, March 16th, 2019, 10:51:00 AM IST

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాజ‌కీయ భ‌విత్వ్యం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది. క‌ర్నూలు ఎంపీగా గెలుసొందిన ఆమె తిరిగి త‌న‌కు ఇదే స్థానాన్ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కేటాయిస్తార‌ని కొండంత ఆశ‌తో గ‌త కొన్ని రోజులుగా ఎదురు చూస్తోంది. అయితే బాబు మాత్రం ఆమె స్థానంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదుం. దీంతో బుట్టా రేణుక ప‌య‌న‌మెట‌నే వార్త‌లు జోరందుకున్నాయి. వైకాపా నుంచి ఎంపీగా గెలిచిన ఆమె మూడు నెల‌ల్లోనే టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అయితే తాజాగా క‌ర్నూలు మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి కుటుంబం టీడీపీలో చేర‌డంతో బుట్టా రేణుక‌కు ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. దీంతో త‌న‌కు క‌ర్నూలు ఎంపి టికెట్ రావ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు మొద‌ల‌య్యాయి. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లు పార్టీలు బుట్టా రేణుక‌ను త‌మ పార్టీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానించ‌డం మొద‌లుపెట్టాయి. ఇప్ప‌టికే బీజేపీ క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్థి పార్థ‌సార‌థి ఆమెను ఆహ్వానించిన‌ట్లు తెలిసింది. ఇక జ‌న‌సేన‌లోకి రావాల‌ని నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా బుట్టా రేణుక‌ను ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. అయితే నాదేండ్ల ఆహ్వానాన్ని బుట్టా రేణుక సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. టీడీపీ పార్టీ వ‌ర్గాలు మాత్రం బుట్టాకు ఎమ్మెల్సీ ఇస్తార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ బుట్టాకు మాత్రం ఎంపీగానే పోటీకి దిగాల‌ని వుంద‌ట‌. త‌న‌కు ఎమ్మెల్సీని కేటాయిస్తే తిరిగి వైకాపాలోకే వెళ్లాల‌ని ఆమె నిర్ణియించుకుంద‌ని, త్వ‌ర‌లో జ‌గ‌న్‌తో భేటీ కానుంద‌ని చెబుతున్నారు.