మహాకూటమి వల్ల ఇబ్బందే – బీవీ రాఘవలు..!

Saturday, November 10th, 2018, 02:59:38 PM IST

2019 ఎన్నికల్లో మోడీని గద్దె దింపటమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు, గత కొన్ని రోజులుగా రాష్ట్రం లో పాలన గాలికి వదిలేసి కేంద్రంలో ఎన్డీయేకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను కలిపే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆయన ఎక్కడ ఏ మీడియా సమావేశంలో మాట్లాడినా కూడా బీజేపీ, మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బాబు అనుకుంటున్నట్టు మహాకూటమి విజయవంతం అవుతుందో లేదో గాని, ఆయన ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నాడు.

తాజాగా సిపిఎం నేత రాఘవులు ఈ అంశం పై స్పందిస్తూ ” బీజేపీ వ్యతిరేక శక్తులను కలపటం వృధా, బీజేపీ తో కలిసున్న పార్టీలను విడదీయటానికి చంద్రబాబు ప్రయత్నం చేయాలి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ ని ఓడించాలి, దేశంలో మహాకూటమి వల్ల లాభం కంటే నష్టం వాటిల్లే అవకాశమే ఎక్కువ” అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మహాకూటమి ఏర్పాటైతే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ని విమర్శిస్తున్న జగన్, మోడీ ని ఎందుకు ఒక్క మాట కూడా అనటం లేదని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు విషయంలో మోడీతో పాటు చంద్రబాబుకి కూడా భాగం ఉందని ఆయన విమర్శించారు.

  •  
  •  
  •  
  •  

Comments