కొత్త చదువులు.. “సీ ఫర్ చోర్.. నెహ్రూ వాజ్ ఎ పీఎం ఆఫ్ చోర్స్”

Thursday, March 8th, 2018, 01:46:48 PM IST

టీచర్ అంటే బాల బాలికల భవిష్యత్తు, రేపటి తరానికి ఓ మూలం. అల్లాంటి టీచర్లే తప్పుడు దార్లో వెళితే..? అలాంటి పరిస్థితే నెలకొన్నది ఇక్కడ. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొత్త రకం చదువు చెబుతున్నాడు. ABCDలకు సాధారణ ఉదాహరణలు కాకుండా కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి అభ్యంతకర భాష వాడుతున్నాడు. “ సీ ఫర్ చోర్.. నెహ్రూ వాజ్ ఎ పీఎం ఆఫ్ చోర్స్” అంటూ విద్యార్థులకు నూరిపోస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. జీన్యూస్ చానెల్ ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం వెలుగుచూసింది. బ్రాహ్మణులు బుర్బాక్ (మూర్ఖులు) అంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నాడు. జార్ఖండ్‌లోని కుటి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఈ అభ్యంతరకర చదువుకు వేదికైంది. ఇవేవీ తెలియని అక్కడి విద్యార్థులు.. ఆ టీచర్ చెప్పింది అలాగే నేర్చుకుంటున్నారు. కుటి స్కూల్‌లో ఇలా జరుగుతున్నట్లు తమకు తెలియదని అక్కడి విద్యాశాఖ వ్యక్తపరచింది. దీనిపై విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. జార్ఖండ్‌తోపాటు యూపీ, బీహార్‌లలోని స్కూళ్లలో అర్హత లేని, కనీస పరిజ్ఞానం లేని ఇలాంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు తమకు వచ్చీరాని చదువు చెబుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కూడా అక్కడ కామనే. సమస్యని పరిష్కరించాల్సింది పోయి ఇలాంటి చదువుతో అక్కడి పిల్లలు బాగుపడతారో లేక భాగోతమేగుతారో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అక్కడి ప్రభుత్వం గాబరా పడుతుందట.