యాక్సిడెంట్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఆ తల్లి కొడుకుల్ని ఏంచేసాడో తెలుసా..?

Monday, February 13th, 2017, 12:50:55 PM IST


దేశరాజధాని ఢిల్లీ లోని నార్త్ వెస్ట్ ప్రాంతంలోజరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది.శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ తన కార్ ని రివర్స్ చేస్తూ నాలుగేళ్ళ బాలుడ్ని ప్రమాదానికి గురిచేశాడు. దీనితో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలనుకున్న క్యాబ్ డ్రైవర్ ని స్థానికులు పట్టుకుని బాలుడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని హెచ్చరించారు. అలాగే తీసుకుని వెళతానని క్యాబ్ డ్రైవర్ ఆ పిల్లాడిని, ఆమె తల్లిని క్యాబ్ లో ఎక్కించుకున్నాడు.గంటలు గడుస్తున్నా తిప్పుతూనే ఉన్నాడు కానీ ఆసుపత్రికి మాత్రం తీసుకుని వెళ్లడం లేదు. మార్గమధ్యంలో తాను యాక్సిడెంట్ చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడట. తన కొడుకు ప్రాణం ముఖ్యమని భావించిన తల్లి అందుకు ఒప్పుకుంది.

అయినాకూడా క్యాబ్ ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తిప్పుతూనే ఉన్నాడు. ఆమె అడిగితే ఆ ఆస్పత్రిలో యాక్సిడెంట్ కేసులు చేర్చుకోరని బుకాయించాడు. ఇలా దాదాపు ఐదున్నర గంటల తల్లీ కొడుకుల్ని క్యాబ్ లో తిప్పాడు. అప్పటికే బాధతో నరకం అనుభవించిన ఆ పిల్లడు చివరకు మరణించాడు. పిల్లడు చనిపోయాడని నిర్ధాక్షిణ్యంగా వారిద్దరిని ఓ చోట ఒంటరిగా వదిలేసి పారిపోయాడు. ఈ విరాల్ని పసివాడి తల్లి వాసంతి పోలీస్ ల ఫిర్యాదు లో పేర్కొంది. జరిగిన విషయాన్ని ఆమె తన భత్రకు టెలిఫోన్ ద్వారా చెప్పింది. ఆమె భర్త వెళ్లేసరికి ఆ పిల్లాడు మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు విచారణ చేస్తున్నారు.