అప్పటినుండి పాత నోట్లు ఉంటే జైలు శిక్షే…?

Wednesday, December 28th, 2016, 02:18:12 PM IST

modi
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు 50 రోజులు సమయం ఇవ్వవలసిందిగా కోరారు. ఈ 50 రోజుల తరువాత ప్రజలకు నగదు కష్టాలు లేకుండా చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ 50 రోజుల్లో మోడీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ నల్లబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. తాజాగా మోడీ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఒక ఆర్డినెన్సు ను కేంద్రం తీసుకొచ్చింది. మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత మాట్లాడుతూ డిసెంబర్ 31 వరకు పాత నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని, ఆ తరువాత మార్చి 31 వరకు రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లో కేవైసి వివరాలు సమర్పించి మార్చి 31 వరకు నగదును మార్చుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు ప్రకారం మార్చి 31 తరువాత రద్దు చేసిన పాత నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మార్చి 31 తరువాత ఎవరైనా పాతనోట్లు కలిగి ఉంటే వారికీ నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష అమలు చేసేందుకు కూడా కేంద్రం యోచిస్తుంది. దీనిద్వారా రద్దైన నోట్లు మరిన్ని వెనక్కి వస్తాయని కేంద్రం భావిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments