కాఫీ కప్పు క్రింద 650 కోట్లు! భాగానే దాచాడు కాని?

Monday, September 25th, 2017, 04:20:34 PM IST

నోట్ల రద్దు తర్వాత చాలా మంది కార్పోరేట్ కంపెనీ ప్రతినిధులు తమ నల్లదనం దాచుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. మరో వైపు అవినీతి మార్గంలో సంపాదించిన సొమ్ముకి సెక్యూరిటీ లేక భద్రంగా దాచుకోవడం మొదలు పెట్టారు. మరో సంపాదించిన ఆదాయంపై పన్ను ఎగవేసేందుకు అడ్డదారులు వెతడం మొదలు పెట్టారు. ఇప్పుడు అలాంటి దారిలో వెళ్లి కెఫే కాఫీ డే యజమాని విజీ సిద్ధార్ధ అడ్డంగా ఆదాయపు పన్ను శాఖకి దొరికిపోయాడు. ఇతను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ ఎం కృష్ణ అల్లుడు కావడం గమనార్హం. ఎలాంటి గుర్తింపు లేకుండా ఆదాయపు పన్నుకి దొరక్కుండా ఇతను 650 కోట్లు వరకు అక్రమ ఆస్తులు పోగుచేసినట్లు అధికారులు నిర్ధారించారు. కర్ణాటకలో 25 చోట్ల అతని ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేసిన అధికారులకి విస్తుపోయే విధంగా అతని ఆస్తులు కనిపించాయి. అతని దగ్గర ఉన్న 650 కోట్ల ఆస్తికి సంబంధించి ఎలాంటి పన్ను చెల్లింపులు జరగకుండా ఉన్నట్లు వారు గుర్తించారుకు . దీనిపై ఆదాయపు పన్ను అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments