చేసిన అకృత్యాలను సెల్ ఫోన్లో చిత్రించి దొరికిపోయిన కామాంధుడు

Friday, January 20th, 2017, 09:55:10 AM IST

kk
సంవత్సరం క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ‘కాల్ మనీ’ కేసులు గురించే మాట్లాడుకున్నారు. ఆ గొడవ ఇప్పుడు ఇక్కడ సద్దుమణిగింది. కానీ తమిళనాడులో మాత్రం అలాంటి ఘటన ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి జిల్లా పాలకోటకు చెందిన శివరాజ్ (44) ఇంట్లోనే ఒక ఫైనాన్స్ సంస్థను నడుపుతున్నాడు. తనవద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారిని భయబ్రాంతులకు గురి చేసి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా వాటిని సెల్ ఫోన్ లో రికార్డు కూడా చేసేవాడు.

2014 అక్టోబర్ నెలలో అతని సెల్ ఫోన్ మరమ్మత్తుకి రావడంతో పాలకోట బస్టాండ్ దగ్గరలోని ఒక షాపులో రిపేర్ చేయడానికి ఇచ్చాడు. అతని సెల్ ఫోన్ లో ఉన్న మెమరీ కార్డులో 30 అసభ్యకర వీడియోలను చూసిన షాప్ ఓనర్ మున్నా శివరాజ్ ను నిలదీసాడు. దాంతో శివరాజ్ కూడా మున్నా పై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన మున్నా ఆ వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పలువురు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శివరాజ్, మున్నా లను ఇద్దరినీ అరెస్ట్ చేశారు. శివరాజ్ ఇప్పటివరకు 60మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. గురువారం జరిగిన ఈ కేసు విచారణలో బాధిత మహిళల సాక్ష్యం మేరకు శివరాజ్ కు నాలుగు యావజ్జీవ శిక్షలు, 2లక్షల జరిమానా, మున్నాకు ఆరు సంవత్సరాల జైలు, 60 వేల జరిమానా విధిస్తూ కోర్ట్ తీర్పు చెప్పింది.