ఈ ఫోటోలో ఐశ్వ‌ర్యారాయ్‌ని గుర్తించండి?

Tuesday, May 22nd, 2018, 02:00:38 AM IST

క్యూట్ ఐశ్వ‌ర్యారాయ్ … చిన్నారి ఐశ్వ‌ర్యారాయ్‌తో దాగుడుమూత‌ల దండాకోర్ ఆడాల‌నుందా? అయితే ఇదిగో ఈ కిడ్స్ బ్యాచ్‌లో క‌ల‌వాలి. అయితే దాగుడు మూత‌లు ఆడే ముందే ఆ గుంపులో ఐశ్వ‌ర్యారాయ్ ఎవ‌రో తెలియాలి క‌దా? అస‌లు ఐష్ ఎక్క‌డుందో ఎలా చెప్ప‌గ‌ల‌రు? ఓసారి ట్రై చేయండి.

గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారా? అయితే ఓ చిన్న క్లూ.. ఇటీవ‌లి కాలంలో ఆరాధ్య‌ను ఎప్పుడైనా చూశారా? చూస్తే ఆ రూపాన్ని ఓ మారు క‌ళ్లు మూసుకుని ఊహించుకోండి. అచ్చం అలా ఆ కిడ్స్‌లో ఎవ‌రు ఉంటే త‌నే ఐశ్వ‌ర్యారాయ్‌. ఇంకా గుర్తు ప‌ట్టలేక‌పోతే ఏం చేయ‌లేం. ఆ గుంపులో హెయిర్ బ్యాండ్ పెట్టుకుని టీచ‌ర్ ప‌క్క‌నే బుద్ధిగా కూచున్న అమ్మాయే ఐశ్వ‌ర్యారాయ్‌. క్యూట్ ఐసూ ఎంత ముద్దు వ‌స్తోందో? ఇప్పుడు ఆరాధ్య‌ను చూసినా అచ్చం అలానే ఉంది. ఇది ఐశ్వ‌ర్యారాయ్ ఒక‌టో క్లాస్ చ‌దువుతున్న‌ప్ప‌టి ఫోటో.

  •  
  •  
  •  
  •  

Comments