రద్దైన పాత నోట్లు ఆ రూపంలోకి??

Sunday, March 18th, 2018, 05:25:47 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నవంబరు 8, 2016న పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో దీనిపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే దృష్టితో ఈ చర్య చేపట్టినట్లు మోడీ అన్నారు. అయితే ఆ సమయంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను (రూ.1000, రూ.500) అలా రద్దు చేయబడిన పాత కరెన్సీ తిరిగి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు చేరుకుంది.

దేశవ్యాప్తంగా పలు ఆర్‌బీఐ శాఖల్లో ఏర్పాటు చేసిన అధునాతన కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ (సీవీపీఎస్) యంత్రాల్లో ఈ పాత నోట్లను ప్రస్తుతం ప్రాసెస్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ తర్వాత ఈ నోట్లను ముక్కలుముక్కలుగా చేసి ఇటుకల రూపంలోకి మార్చుతారు. చివరగా వాటిని వేలంపాట ద్వారా విక్రయిస్తారు అని ఓ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాసెస్ చేసిన నోట్లను రీసైకిల్ చేయబోమని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. కాగా, గతేడాది జూన్ 30 నాటికి రూ.15.28 లక్షల కోట్ల రద్దయిన పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయని ఆర్‌బీఐ ప్రకటించింది….