కేన్స్‌లో శ్రీ‌దేవికి నివాళి.. బోనీలో ఉద్వేగం

Saturday, May 12th, 2018, 02:49:40 PM IST

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణం క‌పూర్ ఫ్యామిలీని చాలా కుంగుబాటుకు గురి చేసింది. ముఖ్యoగా బోనీక‌పూర్ ఈ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. ఓవైపు కుమార్తెలు జాన్వీ, ఖుషీల‌ను పెద్ద స్టార్ల‌ను చేయాల‌న్న అతిలోక సుంద‌రి క‌ల నెర‌వేర‌లేదు. జాన్వీ తొలి చిత్రం `ధ‌డ‌క్‌` సెట్స్‌లో ఉండ‌గానే తాను అంత‌ర్ధాన‌మైంది. అయితే ఈ బాధ‌ల్లో కాస్తంత ఊర‌ట అన్న‌ట్టు.. ఈ ఏడాది జాతీయ అవార్డు వేడుక‌ల్లో శ్రీ‌దేవికి ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ద‌క్కింది. `మామ్` చిత్రంలో శ్రీ‌దేవి న‌ట‌న‌కు గుర్తింపు ద‌క్కింది. ఈ గుర్తింపుతో బోనీ ఫ్యామిలీ కాస్తంత ఊర‌ట చెందింది. అనంత‌రం సోన‌మ్ వివాహ వేడుక‌తో చావు ఇంట కాస్తంత వెలుతురు ప్ర‌స‌రించిన‌ట్ట‌యింది.

అదంతా స‌రే.. శ్రీ‌దేవి వంటి గొప్ప న‌టికి కేన్స్ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో గుర్తింపునిచ్చి ప్రత్యేకంగా శాల్యూట్ కార్య‌క్ర‌మం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండ‌డం ఇటు బోనీక‌పూర్‌లో ఈనెల 16న శ్రీ‌దేవికి ప్ర‌త్యేకంగా శాల్యూట్ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. `ఎ సెల‌బ్రేష‌న్ ఆఫ్ డైవ‌ర్శిటీ & ఎక్స‌లెన్స్ ఇన్ సినిమా` పేరుతో శ్రీ‌దేవికి ఘ‌న‌మైన నివాళిని కేన్స్ ఉత్స‌వాల్లో ప్లాన్ చేయ‌డం బోనీలో ఉత్సాహం నింపింది. శ్రీ‌దేవికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గౌర‌వం ఇవ్వ‌డం, త‌న సేవ‌ల్ని, ప‌నిత‌నాన్ని గుర్తించి ఇలా శాల్యూట్ ఇవ్వ‌డం అన్న‌ది ఎంతో ఎమోష‌న‌ల్ అని బోనీ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments