టీడీపీ – వైసిపి క్యాంటీన్ల పోటీ?

Wednesday, July 25th, 2018, 01:46:47 AM IST


ఇప్పటికే కొద్దిరోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం ఏపీలో అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని చాలా ప్రధాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది, ఇకపై రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేయనుంది టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ అన్న కాంటీన్లు ఇప్పటివరకు ప్రవేశపెట్టినంతవరకు దాదాపుగా ప్రజలందరినుండి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సంపాదించాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అన్న కాంటీన్ కంటే ముందు మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామ కృష్ణ రెడ్డి తన నియోజకవర్గంలో వైఎస్సాఆర్ కాంటీన్లను ప్రవేశపెట్టి రూ.4 కె కడుపునిండా భోజనం అందిస్తున్నారు. అందులో రోజు అన్నం, ఒక కూర, పప్పు, చిప్స్ మరియు వారంలో నాలుగు రోజలు గుడ్డు, మూడు రోజులు అరటి పండు అందిస్తున్నారు. దివంగత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజా శేఖర్ రెడ్డిగారు, ప్రతి పేదవాడికి కడుపునిండేలా అన్నం దొరికేలా చూడడమే తన ద్యేయమని చెప్పేవారని, ఆయన స్ఫూర్తితోనే ఈ కాంటీన్ లను ఏర్పాటు చేసినట్లు ఎమ్యెల్యే ఆర్కె చెపుతున్నారు.

అయితే ఇకపై త్వరలో ఈ కాంటీన్లో ఉదయంపూట టిఫిన్ కూడా అందించనున్నట్లు అయన తెలిపారు. ఈ విషయమై వైసిపి ఎమ్యెల్యే రోజా నేడు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, త్వరలో వైఎస్సార్ కాంటీన్ లను తన నగరి నియోజకవర్గంలో నెలకొల్పనున్నట్లు ఆమె మీడియాకి తెలిపారు. ప్రతి పేదవాడి కడుపు నింపడమే ద్యేయముగా కాంటీన్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష ఎమ్యెల్యేలకు వారి వారి ప్రాంతాల అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తన నియోజకవర్గంలో తన సొంతడబ్బుతో తానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. కావున నగరి ప్రజలందరూ కూడా ఈ కాంటీన్ ను వినియోగించుకోవాలని, పేదసాదలెవరు కూడా తిండిలేకుండా ఉండకూడదని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీపీడీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావని, చంద్రబాబు పాలన చూసి ప్రజలు ఇప్పటికే లోలోపల అసహ్యించుకుంటున్నారని, ఆ బాధని వారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో చూపించితీరుతారని ఆమె అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments