హైదరాబాద్ లో కారు భీభత్సం!

Sunday, April 15th, 2018, 02:47:10 PM IST

ప్రస్తుతం జీవితంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ రోజూ ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్లు జరుగుతూనే వున్నాయి. నిన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్ 12లో బంజారాహిల్స్ కమాన్ వైపు నుంచి అదే మార్గంలో వస్తోన్న స్కూటీని అతివేగంతో కారు ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన చేతన్, అతని స్నేహితుడు నిజామాబాద్ నాందేవాడకు చెందిన దాలియా గాయపడ్డారు.

అంతటితో ఆగని కారు రోడ్డుపక్కన నిలిపి ఉంచిన క్యాబ్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదాలకు కారణమైన కారును డ్రైవర్‌ అక్కడే వదిలేసి పరారయ్యాడు. నంబర్‌ ప్లేట్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు టోలిచౌకి బృందావన్ కాలనీకి చెందిన అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నారు…..