వైరల్ వీడియో: వారి గొడవ వల్ల బిల్డింగ్ పై నుంచి కింద పడిన కారు

Saturday, February 10th, 2018, 06:56:47 PM IST

ప్రస్తుత రోజుల్లో కాస్త నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొందరి నిర్లక్ష్యం వల్ల మరొకరు బలవుతున్నారు. అయితే రీసెంట్ గా ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల కొందరి ప్రాణాలు పోయుండేవి. వారు కూడా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో చావు నుంచి బయటపడ్డారు. రెండవ అంతస్థు నుంచి కారు కింద పడటం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే వారి కారు పడిన కొన్ని నిమిషాలకు ముందే కొంత మంది అటుగా వెళ్లారు. కొద్దీ నిమిషాల ముందు కారు పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. చైనాలో జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజలను భయానికి గురి చేసింది. చోంగ్వింగ్ లో రెండో అంతస్తులో ఉన్న‌ పార్కింగ్ గ్యారేజ్ లోంచి ఒక కారు కిందప‌డిపోయింది. ఘటన మొత్తం అక్కడి సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. కారులో ఉన్న వ్యక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే ఘటన జరగడానికి కారణం కారులో ఉన్న వ్యక్తులు ఆ సమయంలో గొడవపడ్డారని తెలుస్తోంది.