కరెంటు దొంగ..రూ.48 లక్షల విద్యుత్ ని స్వాహా చేసిన సీనియర్ హీరోయిన్ !

Friday, January 20th, 2017, 04:20:55 PM IST

hh
విద్యుత్ శాఖ కి తప్పుడు సమాచారం ఇచ్చిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ అగ్నిహోత్రి తో పాటు ఆమె భర్త అనిల్ మీద ముంబై లో కేసు నమోదు అయింది. దాదాపు నలభై ఆరు లక్షల విద్యుత్ చార్జీలు కట్టకుండా తప్పించుకున్నారు వీరు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింద ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.కాగా, ముంబైలోని వర్లీ సముద్ర తీరంలో ఆమె నివాసం ఉంది. ఆ ఇంటికి త్రీ ఫేజ్ కనెక్షన్ ఉంది. అయితే, తమకు సింగిల్ ఫేజ్ మీటరు ఉన్నట్టుగా చూపించి తక్కువ విద్యుత్ చార్జీలను చెల్లించినట్లుగా అధికారులు గుర్తించడంతో వారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. విద్యుత్ మీటర్లను టాంపరింగ్ చేసి రూ 48 లక్షల విలువైన విద్యుత్ ని అక్రమంగా వినియోగించినట్లు తేలింది.