షో కోసం.. జీవితా రాజశేఖర్ అలా చేసిందా..?

Tuesday, September 27th, 2016, 09:25:06 AM IST

jeevitha
ఓ టివి ఛానెల్ లో ప్రసారమయ్యే సామాజిక చైతన్య కార్యక్రమం “బతుకు జట్కాబండి” పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి జీవిత రాజశేఖర్ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఆమె వ్యక్తిగత కార్యదర్శి ల పై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బతుకు జట్కాబండి కార్యక్రమానికి రావాలంటూ జీవిత వ్యక్తిగత కార్యదర్సులు ఫోన్ చేయి బెదురుస్తున్నారంటూ భాదితులు ఫిర్యాదు చేయడంతో పోలీస్ లు కేసు నమోదు చేశారు. పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి కొండ (29) అనే వ్యక్తి ఆటోడ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

అతడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జ్యోతి ని 2005 లో వివాహం చేసుకున్నాడు.వీరికి సంపూర్ణ (9) అనే కుమార్తె కూడా ఉంది.రెండో కంపు సమయం లో జ్యోతి అనారోగ్యం పాలవడంతో బాబు పుట్టి చనిపోయాడు. కొన్ని రోజులతరువాత వీరు మనస్పర్థలతో గ్రామ పెద్దల సమక్షంలో విడిపోయారు. దీనితో కొండ జ్యోతి కి రూ . లక్ష అందించాడు. ఇటీవల బతుకుజట్కాబండి కార్యక్రమం చూసిన జ్యోతి తన సమస్యకు పరిష్కారం చూపాలని జీవిత ని ఆశ్రయించింది. దీనితో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు కొండ కు ఫోన్ చేసి తరచూ బెదిరించేవారు.కాల్ ను రికార్డ్ చేసిన కొండ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments