క్రైమ్ కహాని : మంత్రి పై అత్యాచారం కేసు..డబ్బుల్లేక భర్తని ఇంట్లో పూడ్చిపెట్టిందట..!

Wednesday, September 28th, 2016, 10:40:53 PM IST

crime-f
దారుణానికి తెగబడ్డ మాజీ మంత్రి :1 కేంద్ర మాజీమంత్రి తనపై అత్యాచారానికి తెగబడ్డాడు అంటూ ఓ మహిళ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ సీనియర్ నేత అశోక్ ప్రధాన పై లైంగిక దాడి కేసు నమోదైంది. నోయిడా కు చెందిన 24 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసుకున్నారు. అశోక్ ప్రధాన్ తోపాటు బాధితురాలు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసింది. వీరిలో బాధితురాలి మామ, పంకజ్ జిందాల్ అనే వ్యక్తి ఉన్నారు.ఇందులో ట్విస్ట్ ఏంటంటే అంతకు ముందు బాధితురాలికి వివాహం జరిపించింది అశోక్ ప్రధానే కావడం విశేషం. అత్తమామల ఇంటికి వెళ్ళినప్పటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది.దీనిపై ప్రధాన్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించాడు.

2భర్తని ఇంట్లోనే సమాధి చేసిన కిలాడీ : ఛత్తీస్ గడ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళ తన భర్తని ఇంట్లోనే సమాధి చేసింది. ఈ విషయం ఏడాది తరువాత వెలుగులోకి రావడం విశేషం.తన భర్త కనిపించకుండా పోయారని ఇరుగుపొరుగువారి చెప్పింది. ఇరుగుపొరుగువారు ఇంట్లోనుంచి దుర్వాసన వచ్చేదని పోలీస్ లకు చెప్పడంతో వారు ఇంట్లోనే తవ్వకాలు మొదలు పెట్టారు. దీనితో తన భర్త మృత దేహం బయట పడింది. దీనితో ఆమె మాట మార్చింది. తనభర్త అకాల మరణం చెందారని సమాధి చేయడానికి తన వద్ద డబ్బులు లేక పోవడం తో ఇలాచేసానని చెప్పుకొచ్చింది. పోలీస్ లు ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

రెండు నెలల మనవరాలి ప్రాణం తీసింది :3 మనవడిని కోరుకునే ఓ మహిళ కోడలు మనవరాలికి జన్మనివ్వడంతో పట్టరానికోపంతో రెండు నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసింది. ఈ దారుణం హరియాణా లోని బహదూర్ ఘడ్ లో జరిగింది. కోడలు మనవరాలికి జన్మనివ్వడంతో పుట్టింటిలోనే ఉండాలని ఓ చాదస్తపు మహిళ కోడలిని ఆదేశించింది. మెగా బిడ్డకు జన్మ నివ్వలేదని వేధించసాగింది. పాపని తీసుకుని అత్తగారింటికి రావడంతో పట్టరాని కోపంతో పాపని తీసుకుని నేలకేసి కొట్టింది.దీనితో ఉటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మరణించింది.దీనితో పోలీస్ లు అత్తని,పాప తండ్రిని అరెస్టు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments