ఓటుకు నోటు కేసును మర్చిపోవద్దు కేసీఆర్ గారు : బీజేపీ

Tuesday, May 8th, 2018, 02:30:52 PM IST

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వివాదం చాలా రోజుల తరువాత చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కారణంగా గతంలో చంద్రబాబు – కేసీఆర్ మధ్య మాటల తూటాలు చాలానే పేలాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతలు ఆ విషయంపై ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా ఎక్కువగా హైలెట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఓటుకు నోటు వివాదం సంచలనం సృష్టించే విధంగా మారనుందనే కామెంట్స్ వస్తున్నాయి.

కేసీఆర్ గతంలో జరిగిన ముఖ్యమైన కేసులన్నింటినీ క్లియర్ చేయాలనీ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆలాగే నిందితులపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగాలని ఆయన తెలియజేశారట. అందులో చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు వివాదం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా చంద్రబాబు ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని హెచ్చరించింది. వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విన్నవించారు. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఎంత మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పై కూడా ఆంజనేయరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగ విధులను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని, వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్యాలని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments