కులం, ధ‌న‌మే న‌డిపిస్తున్నాయ్‌!

Tuesday, August 7th, 2018, 03:47:25 AM IST


అస‌లు ఈ ప్ర‌పంచాన్ని న‌డిపించేది ఏది? అంటే `ఇంధ‌నం` అంటే సుద్ద త‌ప్పు. ఆ ఇంధ‌నం కొన‌డానికైనా డ‌బ్బు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే డ‌బ్బుతో పాటే కులం కూడా కావాలి. ఇక్క‌డ కుల ప్ర‌భావం ఆ రేంజులో ఉంటుంది. కులం కార్డ్ వాడితే చాలు కంప‌లు వేసేయొచ్చు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఎంత‌టి దందాకైనా తెగ‌బ‌డొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బ‌ల‌మైన కులం అధికారంలో, ఉద్యోగాల్లో ఆ స్థాయిలో కంచె వేయ‌డం వెన‌క ఆ కులం యునైటీ అంతే బ‌లంగా ప‌ని చేస్తుంద‌న్న వాద‌నా ఉంది.

ఇదే ప్ర‌శ్న‌ను సీపీఎం నాయ‌కుడు బి.వి.రాఘ‌వులుని అడిగితే ఏమ‌న్నారో తెలుసా? అవును అది నిజ‌మే కులం, ధ‌న‌మే రాజ‌కీయాల్ని శాసిస్తున్నాయి. అవి రెండూ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే మేం అన్నిటా వెన‌క‌బ‌డ్డామ‌ని అంగీక‌రించారు. కుల రాజ‌కీయాలు, ధ‌న రాజ‌కీయాల్ని వామ‌ప‌క్షాలు న‌మ్మ‌వ‌ని, ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా, నిజ‌మైన ప్ర‌జ‌ల కోసం సిద్ధాంత‌ప‌రంగా పోరాటం చేస్తాం కాబ‌ట్టే వెన‌క‌బ‌డ్డామ‌ని తెలిపారు. అసెంబ్లీలో, పార్ల‌మెంటులో సీట్లు త‌గ్గిపోతున్నాయంటే దానికి కారణం కూడా కుల‌బ‌లం, ధ‌న‌బ‌లం త‌మ వ‌ద్ద లేక‌పోవ‌డ‌మేన‌ని అంగీక‌రించారు. ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విషయాల్ని నిర్ధ్వంద్వంగా వెల్ల‌డించారు. ఎంతో సీనియ‌ర్ అయిన ఆయ‌న అన్నారు కాబ‌ట్టి టీవీక్ష‌కుల‌కు ఓ సంగ‌తి స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అస‌లు రాష్ట్రాన్ని న‌డిపిస్తోంది ఏది? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. స్వ‌తంత్య్ర భార‌తావ‌నిలో ఇంత ఎదిగాక ఇంకా కులం ఏంటి బాసూ? అనేవాళ్లున్నారు. కానీ ఆ కులం లేనిదే మునుముందు సామాన్యుల‌కు సైతం మ‌నుగ‌డ ఉండ‌ద‌న్న‌ది జ‌గ‌మెర‌గాల్సిన అస‌లు స‌త్యం.

  •  
  •  
  •  
  •  

Comments