సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ జగమెరిగిన సత్యం: ఎంపీ శత్రుఘ్న

Friday, April 27th, 2018, 11:08:33 AM IST

లైంగిక ఆనందాలు అనేవి అటు వినోదరంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా చెప్పారు. కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని సిన్హా చెప్పారు. నన్ను ఆనందపరిస్తే, నేను నిన్ను ఆనంద పరుస్తాను అనేది దీంట్లో అంతస్సూత్రం. అది చాలా రోజులుగా ఉన్న పద్ధతే. జీవితంలో ముందుకెళ్లడానికి కొన్నిసార్లు కాలం డిమాండ్ చేసినట్లుగా నడుచుకోక తప్పదుఅని సిన్హా పేర్కొన్నారు. సరోజ్‌ఖాన్ కాస్టింగ్‌కౌచ్ గురించి చెప్పిందంటే, చిత్రపరిశ్రమలో నిజంగా అలా జరుగుతున్నదన్నట్లే. సినిమాల్లోకి రావడానికి అమ్మాయిలు ఎలా రాజీ పడాల్సి వస్తున్నదో నాకు తెలుసు. ఆమె వ్యాఖ్యలను నేను పూర్తిగా అంగీకరిస్తాను అని సిన్హా చెప్పారు. రేణుకాచౌదరి వ్యాఖ్యలతోనూ తాను ఏకీభవిస్తానని ఆయన తెలిపారు. బహుశా రాజకీయాల్లో దాన్ని కాస్టింగ్-వోట్-కౌచ్ అనాలేమో. ఔత్సాహికులు అవకాశాల కోసం లైంగిక ఆనందాలు ఇవ్వటానికి సిద్ధమవుతుంటే, సీనియర్ నేతలు వాటిని అంగీకరిస్తున్నారు. ఇలాంటివి సరైనవేనని నేను చెప్పట్లేదు. నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు అని శత్రుఘ్నసిన్హా అభిప్రాయపడ్డారు. సరోజ్‌ఖాన్, రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండించవద్దని, అలాంటి వాతావరణానికి దారితీసే పరిస్థితుల్ని ఖండించాలని ఆయన కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments