జగన్ పాదయాత్రకు ఎదురు దెబ్బ..షాక్ తోపాటు చిన్న రిలీఫ్ ..?

Monday, October 23rd, 2017, 03:56:54 PM IST

వైసీపీ అధినేత జగన్ కు మరో మారు ఊహించని షాక్ తగిలింది. నవంబర్ నుంచి జగన్ పాదయాత్ర చేయనుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా జగన్ పాదయాత్రకు ప్రధాన అడ్డంకిగా అక్రమాస్తుల కేసు విచారణ ఉంది. ప్రతి శుక్రవారం జగన్ విధిగా సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావలసి ఉంది. ఇలా అయితే పాదయత్రని కొనసాగించడం కష్టం. ఈ నేపథ్యంలో కోర్టులో వ్యక్తి గత మినహాయింపుకు ఆరు నెలల పాటు గడువు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ అభ్యర్థనని తోసిపుచ్చిన న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావలసిందే అని తేల్చి చెప్పింది. కానీ జగన్ కు చిన్న వెసులు బాటు కూడా కల్పించింది. ప్రతి శుక్రవారం కాకుండా నెలలో ఒకరోజు హాజరైతే చాలని సూచించింది. ఆరునెలల పాటు పాదయాత్ర చేయాలని భావిస్తున్న జగన్ విధిగా ప్రతి నెల కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

ఆరు నెలల పాటు వ్యక్తిగత మినహాయింపు కల్పిస్తే విచారణ మరింత ఆలస్యం అవుతుందనే సీబీఐ, ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. న్యాయ స్థానం మీద ఉన్న గౌరవంతో విచారణకు హాజరవుతున్నట్లు ప్రజలకు మీరే చెప్పుకోవచ్చు కదా అని కోర్టు సూచించింది. కోర్టు తీర్పు నిరాశ కలిగించడంతో జగన్ పాదయత్ర ప్లాన్ ని మార్చే పనిలో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సీబీఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ జగన్ హై కోర్టులో ఫిటిషన్ ధాఖలు చేయనున్నట్లు వైసిపి వర్గాల నుంచి సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments