ఆసక్తికరంగా మారిన జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ..ఏ పార్టీలోకి?

Monday, September 24th, 2018, 03:02:42 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ముఖ్యమైన పార్టీలు అంటే తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఉన్నాయి,ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చినా సరే నిలదొక్కుకోలేకపోయాయి,కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోరు కేవలం వైసీపీ మరియు టీడీపీ మధ్యనే ఉంటుంది అనుకున్న సందర్భంలో,ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీతో ఎంట్రీ ఇచ్చారు,ఇప్పుడు మూడు ముఖ్య పార్టీకు ఉన్న ఈ సందర్భంలో మరో ముఖ్య పార్టీ రాబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.

సిబిఐ మాజీ కార్యదర్శి జేడీ లక్ష్మీ నారాయణ ఈ పేరు తెలీని వాళ్ళు మన రాష్ట్రంలో చాలా తక్కువ మందే ఉంటారు,ఐతే ఈ మధ్య ఆయన విరివిగా రాష్ట్రంలో రైతులు సమస్యల పట్ల కొన్ని ముఖ్య జిల్లాల్లో పర్యటనలు చేపట్టారు,అందులో భాగంగానే తాను ఇప్పటికే వచ్చే రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు,కాకపోతే తాను కొత్త పార్టీ పెడతారా లేక వేరే ఇతర పార్టీ నాయకులితో నడిచి వెళ్తారా అన్నదాని మీద సందేహం ఉంది.తాను అతి త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు,ఈ విషయం లోనే తన స్నేహితులతోను తనలో తాను మంతనాలు చేసుకొని వచ్చే నెల చివరిలోపు వెల్లడిస్తానన్నారు.ఈయన ఈ సమయంలో ఒంటరిగా బరిలో దిగే అవకాశాలు చాలా తక్కువున్నాయని,సాధ్యమైనంత వరకు వేరే పార్టీతోనే కలిసి వెళ్తారని కాకపోతే ఆ పార్టీ ఏ పార్టీ అనే సందేహాలుతో ఉత్ఖంఠ నెలకొననుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.