శిల్ప ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణ!

Thursday, August 9th, 2018, 09:02:46 PM IST

ఇటీవల తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన డాక్టరు శిల్ప ఆత్మహత్య విషయం రోజు రోజుకి మరింత సీరియస్ గా మారుతోంది. ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు తీవ్ర స్థాయిలో రావడంతో ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఘటనపై సీఐడీ విచారణ చేపట్టడంతో ఒక్కసారిగా వార్త వైరల్ అయ్యింది. సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. ఇక ఇన్వెస్టిగేషన్ టీమ్ లో నలుగురు ఇన్ స్పెక్టర్లుగా తో పాటు ఒక మహిళా ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు.

వైద్యశాల ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా శిల్పా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే శిల్ప మానసిక పరిస్థితి బాగోలేదని పలువురు ప్రొఫెసర్లు చెబుతుండడం అందరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఆమె చావుకు బాద్యులైనవారిని తప్పకుండా శిక్షించాలని ప్రొఫెసర్ల ఒత్తిడి వేధింపుల వల్లే యువతికి ప్రాణాలు కోల్పోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు వారి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతూ.. రాజకీయ అండ ఉండడం వల్లే వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments