సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో మరో ఆరు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయాల్సిన స్థితిలో ఆయన సొంత క్యాడర్‌కు బదిలీ అయ్యారు. ఈ నెల 11న సిబిఐ హైదరాబాద్ విభాగం జెడిగా పదవీబాధ్యతల నుంచి తప్పుకుంటారు.
లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలానికి బాధ్యతలు అప్పగించాలని లక్ష్మినారాయణకు ఆదేశాలు అందాయి. లక్ష్మీనారాయణ 2006లో హైదారాబాద్ సిబిఐకి వచ్చారు. రెండు సార్లు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. డిప్యుటేషన్ కాల పరిమితి ఏడేళ్లు పూర్తి కావడంతో లక్ష్మినారాయణను సొంత క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.