సీబీఐ జేడీ బదిలీకి బ్రేక్ పడిందా..?

Saturday, June 8th, 2013, 07:13:56 PM IST


సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ విషయం సస్పెన్స్ గా మారింది. బదిలీ ఉత్తర్వులు ఇంకా అందలేదని తాజాగా విశాఖపట్నంలో లక్ష్మీనారాయణ తన ట్రాన్స్ ఫర్ పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఇప్పటి వరకూ బదిలీ ఉత్తర్వులు అందలేదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో కూడా తనకు తెలియదని చెప్పారు. ఒక వేళ తాను బదిలీ అయినా.. కొత్తగా వచ్చే అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న కేసులను ముందుకు తీసుకెళ్తారని అన్నారు. మాజీ మంత్రులు సబిత, ధర్మాన విషయంలో కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటానని వెల్లడించారు.

బదిలీ విషయంపై తాజాగా లక్ష్మీనారాయణ స్పందించడంతో.. ఆయన బదిలీ అయ్యారా? లేదా? అన్న ఆసక్తికర చర్చ రాష్ట్రంలో మొదలైంది. అయితే మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చినట్లు, ఇప్పటివరకూ ఉత్తర్వులు అందలేదని ఆయన స్పష్టం చేయడంతో జేడీ బదిలీకి బ్రేక్ పడి ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది. మరో వైపు లక్ష్మీనారాయణ బదిలీని ఆపాలంటూ నిన్న కోర్టులో పిటీషన్ దాఖలైంది.