ఐరాసాలో కూడ పాత గొప్పలే చెప్పుకున్న బాబు !

Wednesday, September 26th, 2018, 11:23:29 AM IST


ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఏ పెద్ద సభల్లో మాట్లాడినా ముందుగా చెప్పుకునే అంశం తన హయాంలో జరిగిన హైరాబాద్ ఐటీ అభివృద్ధి గురించి. ఇలా చెప్పడంలో తప్పేమీ లేకపోయినా తక్కువ సమయం ఉన్న ఐక్యరాజ్యసమితి లాంటి అతి ముఖ్యమైన సమావేశంలో కూడ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలేనా అనే విమర్శలు తలెత్తుతున్నాయి.

సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు అనే అంశం మీద జరిగిన ఈ సమావేశంలో బాబు ఆంద్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం వైభవంగా ఉన్నట్టు కలరింగి ఇచ్చారు. అసలు వాస్తవ పరిస్థితులను కప్పిబుచ్చారు. ఆంద్రప్రదేశ్ వ్యవసాయానికి కేంద్రంగా మారిందన్న ఆయన, మనం ప్రపంచానికే ఆదర్శం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంతేకాదు 2025 నాటికి రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లలో 60 లక్షలమంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా చేస్తామన్నారు.

మన వ్యవసాయరంగ పరిస్థితి తెలియని బయటి వ్యక్తులు ఈ మాటల్ను విని చప్పట్లు కొట్టవచ్చేమో కానీ అన్నీ తెలిసిన మనం అభినందించలేం. ఇప్పటికీ రాష్ట్రంలో సకాలంలో నీళ్లు అందక, బోర్లు పడక, నకిలీ విత్తనాల, నకిలీ ఎరువుల బారినపడి, బ్యాంకు రుణాలు కట్టలేక, పెట్టుబడి సాయం అందక, పంటకు గిట్టుబాటు ధర లేక ఎంతమంది రైతులు నానాయాతన పడుతున్నదీ మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వారందరికీ ప్రభుత్వం ఏమాత్రం చేయూతను అందిస్తోంది మనకు తెలుసు. మరోవైపు చూస్తే లక్షల ఎకరాలు రసాయనిక సేద్యంతో కలుషితమై సేద్యానికి పనికిరాకుండా పోయాయి. మరి ఇవన్నీ బాబుకు తెలియవా ఆంటే తెలీవని కాదు ఐకాసాలో అవన్నీ అసందర్భం అని ఆయన ఉద్దేశ్యం.