జనసేనానికి పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు!

Sunday, September 2nd, 2018, 03:16:26 PM IST

టాలీవుడ్ లో అద్భుత విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన 47వ జన్మదినం నేడు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గత జనవరిలో విడుదలయిన అజ్ఞాతవాసి చిత్రంతో కొన్నాళ్లపాటు సినిమాలకు విమమం ఇచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రాబోయే 2019 ఎన్నికలకు ఇప్పటినుండి జనసేనపార్టీని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఆయన ప్రజా పోరాట యాత్ర కూడా చేపట్టిన విషయం తెలిసిందే. కాగా నేడు అయన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈషా రెబ్బ, నారా లోకేష్, సాయి ధరమ్ తేజ్, నితిన్, సమంత వంటి ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే నేడు అయన జన్మదినం సందర్భంగా అయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన, అన్నదాన శిబిరాలను ఏర్పాటుచేస్తున్నారు. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకుని, పవన్ సీఎం పీఠాన్నిఅధిష్టించి, రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది నేటిఏపి టీమ్…

  •  
  •  
  •  
  •  

Comments