షాక్ .. ఇకపై వెబ్ సిరీస్ లకు కళ్లెం ?

Monday, October 8th, 2018, 01:41:04 PM IST

నిజంగా వెబ్ సిరీస్ చేయాలనుకున్న దర్శక నిర్మాతలకు ఇది షాకింగ్ న్యూస్ … మితిమీరిన శృంగారం, హింస, సెక్స్ లాంటి అంశాలతో సినిమా చేయాలనుకున్న వారు . ఇవన్నీ సెన్సార్ లో కట్ అవుతాయని తెలిసి .. దాన్నే వెబ్ సిరీస్ ల పేరుతో తీస్తున్నారు .. ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ సెక్స్ చిత్రాలకంటే దారుణంగా ఉన్నాయంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. వెబ్ సిరీస్ లలో ఎలాగూ సెన్సార్ లేదు కాబట్టి రెచ్చిపోయి మరి శృంగార సన్నివేశాలను పెట్టేస్ట్ .. పోర్న్ చిత్రాల తరహాలో వేడి పెంచేస్తున్నారు. విదేశాల్లో అయితే .. ఇది వేరే విషయం , కానీ ఇండియాలో అలా కాదు .. ఇప్పుడు సెల్ ఫోన్స్ పుణ్యామా అని అరచేతిలోఈ సెక్స్ సామ్రాజ్యం తొంగిచూస్తోంది .. దీని వల్ల యువత పెడత్రోవ పడుతుంది. తాజాగా ఏక్తా కపూర్ తీసిన ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్ సంచలనం రేపుతోంది . ఈ సినిమా రేపిన దుమారం అంతా ఇంతా కాదు … ఈ వ్యవహరం పై సెన్సార్ బోర్డు స్పందించేలా ఘాటు సన్నివేశాలతో దుమారం రేపింది.తాజాగా ఈ సినిమా గురించి సెన్సార్ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగిందని … ఇలాంటివి పట్టించుకోకపోతే .. ఇండియాలో ఇలాంటి పోర్న్ సినిమాలు మరిన్ని వచ్చే అవకాశము ఉందంటూ వారు చర్చించారు. ఇప్పుడు చాలా మంది వెబ్ సిరీస్ ల పేరుతొ బూతు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో వెబ్ సిరీస్ లను కూడా సెన్సార్ చేయాలనీ ఓ నిర్ణయానికి వచ్చేసారట!! ఈ వెబ్ సిరీస్ లతో మంచి బిజినెస్ పరమైన లాభాలు ఉన్నాయి . ఇలాంటి సిరీస్ చేసేందుకు స్టార్ లు సైతం ఓకే అంటున్నారు . అయితే వెబ్ సిరీస్ ల పేరుతొ మంచి సినిమాలు తీస్తే పరవాలేదు కానీ .. బూతు చిత్రాలే ఎక్కువగా తీస్తున్నారు. అందుకే త్వరలోనే ఈ ఆర్డర్ ని ప్రభుత్వం విడుదల చేయనుంది.