ఏపీకి పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం!

Wednesday, June 13th, 2018, 05:26:15 PM IST

గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా, అలానే విభజన హామీల విషయమై ఎన్డీయేలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చేలా హామీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అవి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర వైఖరికి నిరసనగా అధికార టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్ర నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కాగాఇప్పటికే హోదా బదులు ప్రత్యేక ప్యాకెజీ పేరుతో గత బడ్జెట్ లో కూడా మొండిచెయ్యి చూపి ఏపీని దెబ్బకొట్టిన కేంద్రం, నేడు మరొక పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున బయ్యారం, అలానే కడప ఉక్కు కర్మాగారాల ఏర్పాటు కుదరదని నేడు కేంద్రం తేల్చి చెప్పింది. విభజన హామీల సమయంలో అవకాశం వున్న మేరకు సాధ్యాసాధ్యాలు, కూలంకష పరిశీలనల తర్వాత అప్పట్లో గడచిన ఆరునెలల తర్వాతే కుదరదని చెప్పామని అన్నారు.

అయితే కొందరు మంత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అభ్యర్ధన మేరకు మరొక్కమారు మెకాన్ సంస్థతో పూర్తిస్థాయి అధ్యయనం చేయించిన తర్వాతనే రెండు చోట్ల కూడా కర్మాగారాల ఏర్పాటు కుదరదని చెపుతున్నాం అన్నారు. వాస్తవానికి ఖనిజాలు లభించడం కష్టతరమైన ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్మాగారాల ఏర్పాటు కుదరదనేది కూడా కేంద్ర ప్రభుత్వ వాదన. ఒకవేళ ఆలా ఏర్పాటు చేస్తే ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని అంటోంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ద్వారా కూడా అన్ని పరిశీలనలు జరిపి, చివరకు అవకాశం లేకపోవడం వల్లనే కుదరదని తేల్చి చెపుతున్నామన్నారు. ఈ విషయమై సుప్రీమ్ కోర్ట్ లో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశామని, ఇప్పటికే కోర్ట్ లో దాఖలైన పిటీషన్లపై పూర్తి సమాధానాలను అఫిడవిట్ లో పొందుపరిచినట్లు కేంద్రం నివేదించింది. దీనితో ఉక్కు కర్మాగార ఏర్పాటు ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది……

  •  
  •  
  •  
  •  

Comments