కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతియా హోదా కుదరదన్న కేంద్రం!

Friday, August 10th, 2018, 12:00:48 PM IST

రాష్ట్రానికి జాతీయ హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్లు బీజేపీ ముందు నుంచి చెబుతోంది. అయితే తెలంగాణాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఊహించని విధంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతియా హోదా ఇవ్వలేము అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తేల్చి చెప్పారు. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ విధమైన సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ తీరుపై తెలంగాణ పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుపడి గత నాలుగేళ్లుగా కేసీఆర్ చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎలాంటి విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి హామీ ఇచ్చారో అదే తరహాలో కాళేశ్వరం ప్రాజక్టుకు కూడా ఇవ్వాలని తెరాస ఎంపీలు సూచించారు.

  •  
  •  
  •  
  •  

Comments