పార్లమెంట్లో ఎంపీల నిరసన నేపథ్యంలో కేంద్రం లో కదలిక?

Tuesday, February 6th, 2018, 06:35:15 PM IST

పార్లమెంటు ఉభయ సభా సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మంగళవారం ఓ ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయాగా ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ
విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ రుణం తీసుకుంటే 90 శాతం కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని జైట్లీ ప్రకటించారు.
అలాగే త్వరలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని ఢిల్లీకి పిలిపిస్తామని అన్నారు. ఈఏపీ నిధులను నాబార్డ్ ద్వారా ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నారని, అలా ఇస్తే రాష్ట్రానికి అప్పు సామర్థ్యం తగ్గుతుందని, ద్రవ్యలోటు వ్యత్యాసం ఏర్పడుతుందని అయినప్పటికీ ఈ సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తున్నట్లు అన్నారు. ఆర్థిక లోటు కింద రూ.3900 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రైల్వే జోన్ వంటి అంశాలపై టీడీపీ ఎంపీలు నిలదీయగా రైల్వే జోన్ అంశంపై పీయూష్ గోయల్ స్పందించారు. రైల్వే జోన్ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని, ఆ రాష్ట్రాలతో చర్చిస్తున్నామని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు…..