ప్రత్యేక హోదా కష్టమే..పన్ను రాయితీ కూడా లేదు: కేంద్రం?

Wednesday, March 7th, 2018, 12:35:15 AM IST

ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాయకులు కేంద్రంపై ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలను టీడీపీ నేతలు అడ్డుకుంటూ వారి స్టైల్ లో నినాదాలు చేస్తున్నారు. అయితే నిన్న టీడీపీ మంత్రి వర్గం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తో సమావేశం జరిపారు. రాష్ట్ర విభజన హామీల గురించి దీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో సానుకూలంగా లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దానికంటే స్పెషల్ ప్యాకేజీలో ప్రత్యేక అంశాలు అమలయ్యేలా సహాయం ఇవ్వడానికి ఆసక్తిని చూపుతున్నారట. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు తప్పకుండా ఇవ్వాలని గట్టిగా అడిగారు. కానీ ఆర్థిక షాక ప్రత్యేక హోదా కంటే స్పెషల్ ప్యాకేజి వైపే కుదురుతుందని చెబుతోంది.

ఇప్పుడు పన్ను రాయితీలను అమలు చేస్తే.. కొన్ని వెనుకబడిన రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో డిమాండ్ చేస్తాయి, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ – బెంగాల్ – బీహార్ రాష్ట్రాలు ఎంతో కాలంగా పన్ను రాయితీలను అడుగుతున్నాయి. కానీ ఒక విషయంతో పది తలనొప్పులు రాకూడదని కేంద్రం అన్ని వైపులా ఆలోచింఛాక కుదరదని గట్టిగా చెబుతోందట. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే రాష్ట్రంలో పెద్దగా మార్పులు ఏమి చోటు చేసుకోలేవు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఎంతో కొంత లాభం ఉంటుంది. భారీ ప్రాజెక్టులు రాజధాని నిర్మాణం తొందరగా పూర్తవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి కేంద్రం ఈ ప్రత్యేక హోదా కష్టంమంటే రాష్ట్రంలో ప్రతి పక్షాలు ఆందోళన చేయకుండా ఉండవని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.