అత్యాచారం జరిపితే ఇక ఉరిశిక్షే!

Tuesday, July 31st, 2018, 10:22:33 AM IST

మహిళల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దేశంలో కథువా ఉన్నావ్ ఘటనలు ప్రతిఒక్కరిని కదిలించిన సంగతి తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష పడాలని ఏ బాలికపై మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఏప్రిల్ 21 కేంద్రం కొత్త ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టింది. దోషులను కఠినంగా శిక్షించేలా ఉన్న కీలకమైన క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది.

దీంతో దేశవ్యాప్తంగా అందరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమని చెబుతున్నారు. బాలికలపై అత్యచారం లేదా సామూహిక అత్యచారం జరిపితే నిందితులకు బ్రతికే అర్హత లేదని ఉరిశిక్ష విధించాలని కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఇక బిల్లుపై హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చలో సమాధానాలు ఇచ్చారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యచారం జరిపితే 20 ఏళ్ల జైలుశిక్ష, జీవితకాలం జైలు శిక్ష లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు. ఇక పదహారేళ్ళ బాలికలపై ఘటనకు -పాల్పడితే 20 ఏళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష. ఇక మహిళలపై లైంగిక దాడికి పాల్పడే వారికి పదేళ్ల కఠినకారాగార శిక్ష నుంచి జీవితఖైదు శిక్ష అమలవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments