ప్రైవేటు స్కూళ్ల పనిపట్టనున్న కేంద్రం.. ఫీజు ఎక్కివైతే చర్యలు తప్పవు!

Saturday, June 9th, 2018, 12:08:45 AM IST

ప్రస్తుత రోజుల్లో విద్య అనేది వ్యాపారంగా మారిందని కొన్ని ప్రయివేట్ స్కూళ్లను చూస్తుంటే అర్ధమవుతోంది. ఇష్టం ఉన్నట్లు ఫీజులను పెంచేస్తూ మధ్య తరగతి కుటుంబాలను దోచేస్తున్నారు. పిల్లలకు మంచి విద్య అందాలని తల్లిదండ్రులు కూడా ఫీజులను లెక్క చేయడం లేదు. ఎంతైనా పరవాలేదు అనే విధంగా డబ్బు కట్టేస్తున్నారు. ఇక ఈ పరిస్థితి ని అదుపులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేసే ప్రయివేటు పాటశాలలకు చెక్ పెట్టాలని అనుకుంటోంది. అన్ని వర్గాల అధికారుల నుంచి ఈ నిర్ణయంపై ఒక వివరణ తీసుకొని త్వరలోనే అమలు చేస్తామని ఇటీవల కేంద్ర ప్రతినిది ఒకరు మీడియాకు తెలియజేశారు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ఫీజుల బాదుడు ఎక్కువయిందని అక్కడి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చుకుంది. గుజరాత్ – మహారాష్ట్ర కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించి కార్పొరేట్ పాఠశాలలకు కళ్లెం వేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ లో మరిన్ని మార్పులు చేస్తూ ప్రతి రాష్ట్రంలో స్కూళ్లు ఒక పరిధిలో ఫీజులను తీసుకోవాలని డిసైడ్ చేయనున్నారట. అడ్మిషన్ చార్జీ, స్కూల్ యూనిఫాం చార్జీల విషయంలో ఎక్కువగా వసూలు చేయకుండా కొత్త నిబంధనలను తీసుకురానున్నారు. ఆ రూల్స్ క్రమంగా పాటించే విధంగా చర్యలు తీసుకోనున్నారట. ఒకవేళ ఎవరైనా చెప్పిన దానికన్నా ఎక్కువ ఫీజును వాసులు చేస్తే ప్రయివేటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకుంటానున్నారు. అవసరం అయితే గుర్తింపు రద్దు కూడా చేయడానికి వీలుగా ఆ చట్టం ఉంటుందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments