ఈవ్ టీజింగ్ కు గురైన కేంద్ర మంత్రి.. కారులో వెళుతుండగా..

Tuesday, June 12th, 2018, 05:30:39 PM IST

ప్రస్తుత రోజుల్లో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మహిళలపై దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కొంత మంది పోకిరీలు మహిళల వయసు బేధాన్ని కూడా లెక్క చేయకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ మహిళలు ఈవ్ టీజింగ్ కు గురవుతుండడం రోజు సోషల్ మీడియాలలో ఎదో ఒక చోట తెలుస్తూనే ఉంది. ఇకపోతే ప్రజానాయకురాలైన ఒక మహిళా మంత్రి కూడా ఈవ్ టీజింగ్ కు గురవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కు అలాంటి చేదు అనుభవమే ఇటీవల ఎదురైంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఉత్తరప్రదేశ్ లోని సొంత నియోజవర్గమైన మీర్జాపూర్ లో ఒక కార్యక్రమన్నీ ముగించుకొని వస్తుండగా ఆమె కారును కొంత మంది పోకిరీలు ఫాలో అయ్యారు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు మంత్రి పై అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె సెక్యురిటి బెదరించినప్పటికీ కారులో స్పీడ్ గా వెళుతూ వారిని దూషించారని తేలింది. ఔరాయ్, మీర్జామురాద్ ల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వెంటనే మంత్రి ముగ్గురి తనను వేధించారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. నెంబర్ ప్లేట్ లేని వాహనంలో దుండగులు వెళ్లారని చెప్పగా పోలీసులు వారిని కొన్ని గంటల్లో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కార్ ను సీజ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments