ఆధార్ కోసమంటే కోపాలు.. కానీ వీసా కోసం బట్టలిప్పేస్తారు !

Monday, March 26th, 2018, 09:50:49 AM IST

ఆధార్ విషయంలో ప్రస్తుతం కేంద్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అన్ని కరెక్ట్ గా ఉండాలని వివిధ అంశాలకు సంబందించిన వ్యక్తి వివరాలు ఆధార్ కి అనుసంధానం చేయాలనీ చూస్తున్నారు. ప్రతి ఆస్తిపై ఆధార్ తప్పనిసరి. అయితే కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఆధార్ డేటా ను అడిగితే కొందరికి ఎక్కడలేని భయం పట్టుకుంటుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ చెప్పారు. ఇటీవల ఆధార్ డేటాబేస్‌కు రక్షణ కల్పించాలని ఆందోళనలు చెలరేగుతున్నాయి.

ఈ విషయంపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆధార్ కోసం ప్రభుత్వం ఊరు అడ్రస్ అడిగితే అవి వ్యక్తిగతమని సమస్యలు వస్తాయని భయపడే వారు వీసా కోసాం మాత్రం తెల్లోడి ముందు గుడ్డలు విప్పేస్తారని సమాధానం ఇచ్చారు. అడిగితే ఎక్కడలేని కోసం అలాగే ఉద్యమాలు పుట్టుకొస్తాయని కామెంట్ చేశారు. ప్రభుత్వం కు ఊరు పేరు అడిగితే ఎందుకు ఇబ్బందులు వస్తాయో అర్ధం కావడమే లేదని కేజే అల్ఫోన్స్ తెలుపుతూ.. ఉడాయ్’ సమాచారం దొంగిలించడం ఎవరివల్ల సాధ్యం కాదని ఫుల్ సెక్యూరిటీగా ఉంటుందని వివరించారు.