వైసిపిని ఉద్దేశించి కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Friday, April 27th, 2018, 08:52:49 AM IST

గత కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా అధికార పార్టీ సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్డీయే ప్రభుత్వతీరుని ఎండగడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అధికార టిడిపి పార్టీ తాము ఎన్డీయే నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయమై ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో వున్న కేంద్ర సామజిక న్యాయ సాధికారత సఖ మంత్రి రాందాస్ అధావలె మీడియా తో మాట్లాడారు. టిడిపి వారు ఎన్డీయే నుండి బయటకి రావడం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు.

అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మోడీ, తమ ఎన్డీయే ప్రభుత్వం తరపున తగు సాయం అందిస్తున్నామని, అయినప్పటికి టిడిపి బయటకు రావడం సరైనది కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎన్డీయేలో కలిస్తే బాగుంటుందని, ఆ పార్టీని ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇటీవల సుప్రీమ్ కోర్ట్ ఎస్సి, ఎస్టీ కేసు పై ఇచ్చిన తీర్పు సరైనది కాదని, అందుకే దీనిపై త్వరలో ఒక ఆర్డినెన్సు తీసుకురావాలని కేంద్రం యత్నిస్తోందని ఆయన చెప్పారు. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని,

అందుకే ఏపీకి అడిగిన దానికంటే ఎక్కువగానే నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం ఎప్పుడు సిద్దంగానే ఉంటుందని, అందుకని ఏపీ ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి తిరిగి ఎన్డీయేలోకి వస్తే మంచిదన్నారు. అసలు జగన్ పై ఇన్ని కేసులు పెట్టడానికి కారణం ఆయన కాంగ్రెస్ ని విబేధించడమే అని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, దేశప్రజలు మోడీ పాలనలో సుఖసంతోషాలతో వున్నారని, కావున మరోసారి కూడా ఆయన అధికారమే కావాలని కోరుకుంటున్నారని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments