సమస్యలను ప్రశ్నిస్తున్న టీచర్ మైక్ కట్ చేసిన కేంద్ర మంత్రి

Wednesday, May 9th, 2018, 02:13:46 PM IST

ఓ రిటైర్డ్ టీచర్ రోడ్ల సమస్యలపై ప్రశ్నిస్తే.. సాక్షాత్తు కేంద్ర మంత్రే మైక్‌ను కట్ చేసిన ఘటన అసోంలోని నాగౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓట్లు వేసినందుకు ముందుకు ప్రజలకోసం పాలన చేసి ప్రజల క్సహ్తాలు తీర్చాల్సింది పోయి, తిరిగి ప్రజలనే దోచుకుంటున్న వైనం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అయితే స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సభకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజేన్ గోహెన్ హాజరయ్యారు. సభలో అధికారులు మాట్లాడిన తర్వాత ఓ రిటైర్డ్ టీచర్ మాట్లాడటం ప్రారంభించాడు. అమోలపట్టిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. రోడ్లను బాగు చేయాలని ఇప్పటికే పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించాం. అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి, కొత్త ఎమ్మెల్యే వస్తేనే రోడ్లు మెరుగుపడే అవకాశం ఉందన్నారు రిటైర్డ్ టీచర్. టీచర్ మాటలకు కోపం తెచ్చుకున్న కేంద్ర మంత్రి రాజేన్ గోహెన్.. ఆయన దగ్గరకు వెళ్లి మైక్‌ను కట్ చేశారు. స్పీచ్‌లతో సమస్యలు పరిష్కారం కావు అని కేంద్రమంత్రి అన్నారు. టీచర్ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆయనకు మైక్ ఇచ్చేందుకు రాజేన్ గోహెన్ తిరస్కరించారు. సభలో దీనికి సంబంధించి చిన్నపాటి ఆందోళన జరగడంతో కేంద్రమంత్రి రాజేన్ సభ మధ్యలోంచి ఆ టీచర్ ను బయటికి పంపించారు. ఈ విషయంపై సభకు వచ్చిన ప్రేక్షకులు కొంచం ఆందోళన చేపట్టే అవకాసం కనపడటంతో పోలీసులు ముందుగానే పసిగట్టి పరిస్థితులు చక్కదిద్దారు.