షాకింగ్ న్యూస్ : బుల్డోజర్ కింద పెట్టి తోక్కించేస్తా : కేంద్ర మంత్రి గడ్కరీ

Saturday, May 19th, 2018, 04:56:58 PM IST

మధ్యప్రదేశ్ లో అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ కాంట్రాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశ భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ కాంట్రాక్టరయినా స్వలాభానికోరకు గానీ, దుర్వినియోగాపాలు గానీ చేస్తే ఊరుకునేది లేదని, మీరు పని చేసే బుల్డోజర్ల కొండ రాళ్ళలా మిమ్మల్ని కూడా తోక్కించేస్తా అని హెచ్చరించారు. ఎవరిపైన కూడా కనికరం చూపించను అని అన్నారు. అనవసరంగా పెద్ద ప్రాజెక్టు వచ్చింది కదా అని ఉన్న దాంట్లో కావలసినంత సొమ్ము ఇక్కడే దోచేసుకున్తామని ఎవరైనా అనుకుంటే గనక వారికి తీవ్రంగా శిక్ష విధించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

రహదారుల ప్రాజెక్టులపై పని చేస్తున్న కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు కట్టడం లో ఉన్న పనులను పరిశీలించాలని, ఎకడైనా పనులు సక్రమంగా జరగకపోతే వెంటనే అప్రమతమిన్ వచ్చిన సమస్యలను పరిష్కరించి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా అవినీతి చేసినట్టు కనిపించినా, వినిపించినా నేను అస్సలు సహిన్చనని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments