ఏపీ సీఎం రహస్య సర్వే ఫలితం ఇదేనా..?

Saturday, May 12th, 2018, 03:56:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొద్ది కాలంగా తన స్వంత రాష్ట్రంలో కనీసం మద్దతు అయినా లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు, దీనికి సంబందించిన విషయంపై ఆయన ఒక కొత్త ప్రణాలికను రూపొందించి ఎక్కడ సమస్యల్యు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆలోచనతో తమ పార్టీ ఎమ్మెల్యే లపై రహస్యంగా ఒక సిక్రెట్ సర్వే చేయించారు. టీడీపీ పార్టీలో లీడర్ గా ఉన్న ప్రతీ నియోజక వర్గాల వారికీ ఎమ్మెల్యేల పనితీరును బట్టి, వారికీ ప్రత్యేకమైన ర్యాంకులను కూడా ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆ సర్వేలో ఆయా నియోజక వర్గంలో తమ ప్రజా ప్రజాప్రతినిధుల గురించి ఏమనుకుంటున్నారు, వారి పాలన ఎలా సాగుతుంది అన్న విషయంపై రహస్యంగా కార్వే చేయించి ప్రజల వద్ద నుండి వచ్చిన సమాధానం పరంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు కూడా ఇచ్చారు.

చంద్రబాబు చేపట్టిన ఈ రహస్య సర్వే లో గన్నవరం ప్రాంత ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం తో నెం.1 స్థానంలో ఉండగా, దీని తరువాత బోడ్ ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, శ్రీరాం తాతయ్య , రాధాకృష్ణ, రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ , తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు , చింతకాయల అయ్యన్నపాత్రుడు వున్నారు. అయితే ఇలాంటి పరీక్షలు ఎప్పుడూ ఉంటాయని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు ప్రతీ ఎమ్మెల్యే కేవలం ప్రజా పాలనే చేయాలని, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల పని తీరుపై తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌నే వారి ముందు ఉంచామని సమావేశంలో చెప్పారు. కార్యకర్తల పరీక్షలో పాస్‌ కాకపోతే మళ్లీ పాస్‌ కావలసిందేనని సుతిమెత్తగా చెప్పారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా ఒక్కొసారి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. తక్కువ ర్యాంక్స్ వచ్చిన ఎమ్మెల్యే లు మేమూ సైకిళ్లు బాగానే తొక్కుతున్నాం, నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాం, అందరిని పలకరిస్తున్నాం. అని ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఈ సర్వే వివరాలను ఎమ్మెల్యే కి సీఎం నిన్న జరిగిన శాసనసభ పక్ష మీటింగ్ లో అందజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments