సర్ అంటే ధోనికి నచ్చదు.. చాహల్ కామెంట్స్!

Saturday, June 2nd, 2018, 05:31:48 AM IST

భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే ఎవ్వరైనా సరే గౌరవం ఇవ్వకుండా ఉండలేరు. కానీ ధోని మాత్రం ఎంత సీనియర్ అయినప్పటికీ సదరు ఆటగాళ్లతో ఫ్రెండ్లిగా ఉండేవాడు. అంతే కాకుండా యువ ఆటగాళ్లు ఎవ్వరు కొత్తగా జట్టులోకి వచ్చినా కూడా వారికి ప్రత్యేక సలహాలు ఇస్తూ ఉత్తేజపరుస్తుంటాడు. ఇకపోతే ధోనిని ఎవరైనా సర్ అంటే అస్సలు ఒప్పుకోడట.

ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ తెలిపాడు. చాహల్ మాట్లాడుతూ.. జింబాబ్వే తో నా మొదటి వన్డే మ్యాచ్ ఆడాను. ఆ పర్యటనలో ధోని నుంచి చాలా నేర్చుకున్నా. అప్పుడు మొదటి సారి ధోని నుంచి క్యాప్ అందుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టా. అయితే బౌలింగ్ వేసేటప్పుడు ధోనిని ఎక్కువగా మహి సర్ అని పిలిచేవాన్ని. అది ఇబ్బందిగా అనిపించిన ధోని.. ఏయ్ నన్ను అలా పిలవకు అని సరదగా నవ్వాడు. మళ్లీ దగ్గరికి వచ్చి మహి, ధోనీ, మహేంద్ర సింగ్‌ ధోనీ, భాయ్‌..అని చెప్పి ఈ పేర్లలో నీకు ఏది నచ్చుతుందో ఆ పేరుతో నన్ను పిలువు అని చెప్పారు. అలా చెప్పగానే నేను షాక్ అయ్యాను. అప్పటి నుంచి సర్ అనడం మానేశా అని చాహల్ సరదాగా చెప్పుకొచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments