వీడియో: సీటు బెల్టు పెట్టుకుంటే ఈ విధంగా సేఫ్ అవుతారు

Thursday, October 12th, 2017, 04:42:43 PM IST

తన మంచి కోసం ప్రమాదమని చెప్పినా మనిషి ఒక్కోసారి పట్టించుకోడు. దీంతో చిన్న పొరపాటు వల్ల ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అందులో ప్రాణాలు కోల్పోయేవారిలో ఎక్కువగా మంది సీటు బెల్టు పెట్టుకొని వారే అని తేలింది. ఎవ్వరైనా సరే ఆ సూచనలను పాటిస్తే ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అనేక సార్లు కొన్ని ప్రమాదాలు ఉదాహరణగా నిలిచాయి.

రీసెంట్ గా చైనాలో కూడా సీటు బెల్టు ఎంత ముఖ్యమే ఒక బస్సు ప్రమాదం ద్వారా మరో సారి రుజువైంది. చైనాలోని జుజౌ ప్రాంతంలో స్పీడ్ గా వెళుతున్న బస్సును సైడ్ నుంచి మరొక కారు డీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సుని ఒక్కసారిగా అదుపు చేయడానికి ట్రై చేయాలనీ చూశాడు కానీ బస్సు కంట్రోల్ అవ్వక బోల్తా కొట్టింది. అయితే బస్సులో ఉన్న కొందరు సీటు బెల్టు పెట్టుకోవడంతో వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ సీటు బెల్టు పెట్టుకొని వారికి మాత్రం అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు. బస్సులో ఉన్న సిసి కెమెరాలో ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది.