చైతు vs సమంత ఈ రోజు గెలిచింది ఎవరు..?

Friday, September 14th, 2018, 01:54:57 AM IST


ముందే అనుకున్నారో లేక యాదృచ్చికమో బాక్సాఫీస్ బరిలో వినాయక చవితి సందర్భంగా భార్యా భర్తలు ఇద్దరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకరేమో కుటుంబ సమేతంగా వచ్చారు ఇంకొకరు సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చారు మన అక్కినేని నాగచైతన్య మరియు సమంతా. భార్య భర్తలు కలిసి గుడికి వెళ్లే ఈ రోజున ఈ భార్యాభర్తలు వేరు వేరు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే వీరి ఇరువురిలో ఎవరు గెలిచారు..? అనేది ప్రశ్న.

వీరి ఇరువురి సినిమాల్లో రెండిటికి మంచి హైప్ వచ్చింది. ఆ హైప్ తోనే విడుదల అయ్యాయి. అయితే చైతు సినిమాకి మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు, శైలజ గారి అల్లుడు పెద్ద కొత్తగా అలరించింది ఏమి లేదని, రొటీన్ డ్రామా ఎంటర్టైనరే అని తేల్చి చెప్పేస్తున్నారు. కానీ సమంత సినిమాకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ముందే కన్నడలో సూపర్ హిట్ అయ్యిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కావడంతో సమంతకి ఇంకా ప్లస్ అయ్యింది దీనితో సమంత యొక్క అద్భుత నటనతో కూడా ఆకట్టుకుంది. దీనితో వినాయక చవితి బరిలో భార్యా భర్తల్లో భార్య పెత్తనమే నడుస్తుందని అంటున్నారు. చూద్దాం లాంగ్ రన్ పూర్తి అయ్యేసరికి తెలుస్తుంది ఎవరు అసలైన విజేత అనేది..

  •  
  •  
  •  
  •  

Comments