ప్రీమియర్ షో టాక్ : ఛల్ మోహన్ రంగ.. ఎలా ఉందంటే!

Thursday, April 5th, 2018, 11:55:02 AM IST

లై సినిమాతో ఊహించని విధంగా పరాజయం ఎదుర్కొన్న నితిన్ ఈ సారి ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సరికొత్త ప్రేమ కథతో వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చల్ మోహన్ రంగ సినిమా ఈ గురువారం రిలీజ్ కానుంది. అయితే అమెరికాలో ముందే ప్రీమియర్స్ షోను ప్రదర్శించారు. భారీ స్థాయిలో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రీమియర్స్ షోలు దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందొ చూద్దాం.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ అలాగే శ్రేష్ట్ మూవీస్ సినిమాను కలిసి నిర్మించడం ఒక ప్లస్ పాయింట్ అయితే నితిన్ 25వ సినిమా కావడం మరొక ప్లస్ పాయింట్. మెయిన్ కథను త్రివిక్రమ్ అందించిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు కృష్ణ చైతన్య తనదైన శైలిలో ఫుల్ స్క్రిప్ట్ ను సెట్ చేసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఇకపోతే సినిమా చాలా కూల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా యూఎస్ లో కొనసాగుతుంది. ప్రభాస్ శ్రీను – మధునందన్ కామెడీ సీన్స్ బావున్నాయి. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక అనుకోని కారణంగా మేఘా ఆకాష్ నితిన్ దూరమవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకి ప్లస్ పాయింట్.

అయితే సెకండ్ హాఫ్ ఉహించినతగా ఉండదు. కొన్ని సీన్స్ పై ఇంకా శ్రద్ధ తీసుకుంటే బావుండేది. ఇక భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు చాలా అందంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా నితిన్ సినిమాలో సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించాడు. పవన్ కళ్యాణ్ స్టైల్ ను కొన్ని సీన్స్ చాలా బాగా వాడారు. ఇక ఖైదీ నెంబర్ 150 కాయిన్ ఫైట్ స్పూఫ్ ఆకట్టుకుంటుంది. అందరి కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు బలాన్ని ఇస్తాయి. సినిమా పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments